News February 22, 2026
KNR: మెదడు వాపు.. అప్రమత్తతే శ్రీరామ రక్ష..!

మెదడు వాపు వ్యాధి ప్రాణాంతకమైనదే కాకుండా నయం అయిన తర్వాత కూడా మనిషిని శారీరక, మానసిక వైకల్యానికి గురిచేసే ప్రమాదకర వ్యాధి. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వాపు నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
Similar News
News February 22, 2026
28న GVMC కౌన్సిల్ చివరి సమావేశం

GVMC కౌన్సిల్ సమావేశం ఈనెల 28న జరగనుంది. 37 అంశాలతో అజెండాను సిద్ధం చేసి కార్పొరేటర్లకు అందజేశారు. విద్యుత్ విభాగంలోని ఒప్పంద కార్మికులను కొనసాగించేందుకు వేతనాల మంజూరు ప్రతిపాదించారు. పారిశుద్ధ్యం, భూగర్భ మురుగునీటి విభాగ కార్మికులకు పెంచిన వేతనాలు అమలు చేయనున్నారు. 81వ వార్డులో పైపులైన్ల మార్పు, 95వ వార్డులో రిటైనింగ్ వాల్, 1వ వార్డులో కాలువలు, 71వ వార్డులో బీటీ రహదారి పనులు అజెండాలో చేర్చారు.
News February 22, 2026
పరీక్ష కేంద్రాలవద్ద 163 సెక్షన్ అమలు: ASP హేమంత్

చింతూరు డివిజన్‌లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ASP హేమంత్ అన్నారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే చింతూరు జూనియర్ కళాశాలను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. వీఆర్‌పురం, చింతూరు, కూనవరం పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పటిష్ఠమైన బందోబస్త్ ఉంటుందన్నారు. ఇతరులు కేంద్రాల వద్దకు రావద్దన్నారు. ఎస్‌ఐ రమేష్ ఆయన వెంట ఉన్నారు.
News February 22, 2026
మరోసారి ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్

NCP(SP) చీఫ్ శరద్ పవార్(85) <<19143304>>మరోసారి<<>> పుణేలోని ఆస్పత్రిలో చేరారు. డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్న ఆయనకు ఫ్లూయిడ్స్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పవార్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ రెండు రోజులు ఆస్పత్రిలో ఉంటారని చెప్పారు. కాగా ఈ నెల 9న ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరి 14వ తేదీన డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.


