News December 19, 2025

KNR: మేడారం జాతరకు 700 బస్సులు: ఆర్ఎం

image

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో KNR RM బి.రాజు JAN 2026లో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి రీజియన్ లోని అందరు డిపో మేనేజర్లు, అన్ని డిపోలకు చెందిన ట్రాఫిక్ ఇంఛార్జులు, మెకానికల్ ఇంఛార్జుల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. రీజియన్ పరిధిలోని 6 ఆపరేటింగ్ పాయింట్లు ద్వారా మేడారానికి నడుపనున్న 700 బస్సులకు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌళిక వసతులు, ఇతర అంశాలపై సమీక్షించారు.

Similar News

News December 26, 2025

సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా నూతన కార్యవర్గానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ పదవుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 26న శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కాంగ్రెస్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగితం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు. ఆసక్తి గల వారు ఓటర్ IDతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని పార్టీ PRO తెలిపారు.

News December 26, 2025

జనగామ జిల్లాలో టాప్ న్యూస్

image

> ఈనెల 31న పాలకుర్తి సోమేశ్వరాలయంలో బహిరంగ వేలం: ఈవో
> బచ్చన్నపేట: గుండెపోటుతో జిపిఓ మృతి
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
> జిల్లాలో యూరియా కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు
> రేపు కట్కూర్ లో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు
> జనగామ: మహిళ కబడ్డీ టీం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేయింగ్ కిట్లను పంపిణీ చేశారు.

News December 26, 2025

మతపరమైన గొడవ కాదు.. అతడో క్రిమినల్: బంగ్లా సర్కార్

image

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు <<18670618>>అమృత్ మండల్<<>> హత్యకు గురికావడంపై అక్కడి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘ఇది మతపరంగా జరిగిన ఘర్షణ కాదు. అమృత్ మండల్ ఓ టాప్ క్రిమినల్. అతను ఓ ఏరియాలో డబ్బులు డిమాండ్ చేసేందుకు రాగా స్థానికులతో జరిగిన గొడవలో చనిపోయాడు’ అని పేర్కొంది. కాగా దీపూ చంద్రదాస్ హత్య తర్వాత మరో హిందూ హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.