News January 18, 2026
KNR: మొదలైన సమ్మక్క సారలమ్మ ఎత్తు బంగారం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సమ్మక్క – సారలమ్మ ఎత్తు బంగారం మొక్కులు ప్రారంభమయ్యాయి. తమ కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవార్లకు ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కిరాణా షాపుల్లో ఎత్తు బంగారం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మీ ప్రాంతంలో నిలువెత్తు బంగారం ఇవ్వడం ప్రారంభమైందా..? కామెంట్ చేయండి.
Similar News
News February 6, 2026
పురపోరు: పార్టీలు.. ప్రామిస్‌లు.. పంచాయతీలు

TG: మున్సిపల్ ఎన్నికల్లో పవర్ కోసం ప్రధాన పార్టీలు కుల సంఘాల నేతలను విందులతో ప్రసన్నం చేసుకుంటున్నాయి. ఇక స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలకు హామీ ఇస్తూనే, ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తులకు నేతలు తెరవెనక పర్సనల్ ప్రామిస్‌లు చేస్తున్నారు. ఇక స్థానికంగా రెబల్స్ ముప్పుగా మారకుండా మంత్రులు మంత్రాంగం నడుపుతున్నారు. ప్రతి చోటకూ నేరుగా వెళ్లడం కుదరదు కాబట్టి ఫోన్లోనే పంచాయతీలు సెటిల్ చేస్తున్నారు.
News February 6, 2026
రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలివే..

ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. యాపిల్, జామ పండ్లతో పాటు టమాటాలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తం శుద్ది అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ఆకుకూరలు, బీట్‌రూట్, బెల్లం, పసుపు వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 6, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో ‘మున్సిపల్’ పోరు

ఉమ్మడి KNR జిల్లాలో BJP, BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య మున్సిపల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ నేతలు ప్రచారం చేస్తుండగా.. తాము చేపట్టిన పనులను ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకుంటోందని BRS ఆరోపిస్తోంది. మరోవైపు కేంద్ర నిధులతో పట్టణాల రూపురేఖలు మారుస్తామని BJP హామీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ త్రిముఖ పోరులో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.


