News October 12, 2025
KNR: మోసం చేశాడంటూ యువతి సూసైడ్ అటెంప్ట్

ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందే ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుజూరాబాద్‌కు చెందిన వినోద్‌తో జగిత్యాలకు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో తనకు వేరే యువతితో తనకు పెళ్లి నిశ్చయమైందని, ఇకపై తమ సంబంధానికి స్వస్తి పలుకుదామని ప్రియుడు చెప్పడంతో ఆవేదన చెందిన బాధిత యువతి ఆదివారం అతడి ఇంటికి వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2025
కృష్ణా: APTATS యాప్ మద్యం ప్రియుల భద్రతకు కవచం

విజయవాడ సమీపంలోని ములకలచెరువులో కల్తీ మద్యం కేసు కలకలం రేపిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల భద్రత కోసం “APTATS” అనే యాప్ విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా మద్యం అసలైనదో, కల్తీదో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మద్యం విక్రయాలపై పర్యవేక్షణ బలపడటమే కాకుండా, కల్తీ మద్యం తయారీదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
News October 12, 2025
HYD: ఖాళీగా జడ్జి పోస్టులు.. విచారణ ఆలస్యం!

RR జిల్లాలో సివిల్ క్రిమినల్ కేసులు తదితర అన్ని కేసులు కలిపితే సుమారుగా లక్షకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇన్‌ఛార్జి జడ్జిలే తమ రెగ్యులర్ కోర్టులతో పాటు, ఖాళీగా ఉన్న కోర్టుల విచారణ చేయాల్సి వస్తోంది. దీంతో ఖాళీలతో కేసుల విచారణ జాప్యం జరుగుతోంది. ఖాళీలను నింపాలని, పెండింగ్ కేసులను మొత్తం పూర్తి చేయాలని బాధితులు కోరుతున్నారు.
News October 12, 2025
MDCL: పిచ్చి మొక్కలతో ప్రకృతి వనాలు..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణ, పల్లె ప్రకృతి వనాలలో పిచ్చి మొక్కలే కానొస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అటవిని తలపిస్తున్నాయి. మున్సిపాలిటీలలో కనీసం పట్టించుకునే నాథుడే లేడని పలువురు ఆరోపిస్తున్నారు. వాకింగ్ ట్రాక్స్ మొత్తం మూత పడిపోయాయి. దీనిపై యంత్రాంగం తగినట్లు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.