News May 20, 2024

KNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన HYD దోమలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెజ్జంకి మండలం తోటపల్లె గ్రామానికి చెందిన అజయ్(26) బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాణిగంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న అజయ్ బైక్‌ను సరకు రవాణా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.

Similar News

News January 14, 2025

KNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో

image

సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.

News January 13, 2025

సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్

image

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

News January 13, 2025

ఒకే వేదికపై కరీంనగర్ పార్లమెంటు సభ్యులు

image

నిన్న జరిగిన ఉనిక పుస్తక ఆవిష్కరణలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికను పంచుకున్నారు. అయితే ఈ వేదికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావును నేను ఓడిస్తే.. నన్ను వినోద్ కుమార్ ఓడించాడు. మా ఇద్దరినీ బండి సంజయ్ ఓడించాడని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాకు వన్నె తెచ్చిన మహనీయుడు విద్యాసాగర్ రావు అన్నారు.