News September 6, 2025

KNR: ‘రాగిజావ’ పథకం ఉన్నట్టా..? లేనట్టా..?

image

గ్రామీణ విద్యార్థులకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో రాగిజావ స్కీంను తెచ్చారు. రెండేళ్లుగా సాఫీగా సాగిన పథకం స్కూళ్లు ప్రారంభమై 3నెలలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, ప్రభుత్వం ఈ స్కీంను సాగిస్తోంది. 10గ్రా. బెల్లం, 10గ్రా. రాగిపిండితో జావ ఇచ్చేందుకు ఒక్క విద్యార్థికి 25పైసల చొప్పున ఏజెన్సీకిచ్చేవారు. కాగా, రాష్ట్రంలో ఇప్పుడీ పథకముందా, రద్దయిందా అనే సంకట స్థితి నెలకొంది.

Similar News

News September 6, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రేడ్-Cలో 3 పోస్టులు, గ్రేడ్-Bలో 97పోస్టులు, గ్రేడ్-Aలో 2పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, PG, MBA, PGBM, CA, ICWA, CS ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
వెబ్‌సైట్: <>https://www.oil-india.com/<<>>

News September 6, 2025

HYD: అప్రమత్తమైన అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

image

గణేశ్ నిమజ్జనాలు సురక్షితంగా జరిగేలా తెలంగాణ అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన సరస్సులు, బేబీ పాండ్స్ వద్ద ఫైర్ టెండర్లు, క్రేన్లు, బోట్లు, శిక్షణ పొందిన ఈతగాళ్లతో బృందాలను సిద్ధంగా ఉంచారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ బృందాలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News September 6, 2025

కవిత ఆరోపణల తర్వాత తొలిసారి కేసీఆర్‌తో హరీశ్ భేటీ

image

TG: కవిత సంచలన ఆరోపణల తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు తొలిసారి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. ఇందులో కవిత అంశం చర్చకు వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా హరీశ్‌పై ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.