News October 22, 2024
KNR: రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారుగా ప్రొ.సూరేపల్లి సుజాత

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులను రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. శాతవాహన యూని వర్శిటీ ప్రొ.సూరేపల్లి సుజాతకు ఇందులో చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేశం ఉత్వర్వులు జారీ చేశారు. ఆమె 22 ఏళ్లుగా సోషియాలజీ బోధిస్తున్నారు. సూరేపల్లి సుజాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దళిత మహిళా సాధికారతపై పీహెచ్ చేశారు.
Similar News
News December 23, 2025
REWIND: కరీంనగర్: రాజకీయ రణక్షేత్రం..!

ఈ ఏడాది జిల్లాలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు. సంవత్సరం ఆరంభంలో జరిగిన MLC ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచింది. చివరికి మేధావులు బీజేపీకి పట్టం కట్టారు. ఈ నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో సెగ పుట్టించాయి. ఈ ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిలా మారాయి. అధికార పార్టీకి గట్టి పోటీనిస్తూ BRS, BJPలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచింది.
News December 23, 2025
కరీంనగర్: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్ సేవలు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.