News August 14, 2025

KNR: రూ.లక్షల్లో డబ్బు స్వాహా.. నిందితుడి అరెస్ట్

image

క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్‌ను హన్మకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ట్రాన్సాక్షన్స్‌కి ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News August 14, 2025

KNR: అతి భారీ వర్షాలపై విద్యుత్ వినియోగదారులకు సూచనలు

image

ఈ నెల 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఈ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా, 87124 88004 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. పునరుద్ధరణ బృందాలు 24 గంటల షిఫ్ట్ విధానంలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

News August 14, 2025

KNR: అందరూ భాగస్వాములు కావాలి: సీపీ

image

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా KNR సీపీ గౌష్ ఆలం అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.

News August 14, 2025

KNR: భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖలోని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ కేంద్రంలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.