News December 6, 2025

KNR: రూ.4.50CR SCAM.. ఎంక్వయిరీ రిపోర్ట్ ఎక్కడ..?

image

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4.5 కోట్ల అవినీతి ఆరోపణలపై TVVP రెండు బృందాలతో విచారణ చేపట్టింది. దీనిపై ఎంక్వయిరీలో ఏం తేలిందన్నది బహిర్గతం చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వంలోని ఓ కీలక నేత రిపోర్టు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నాడన్న చర్చ జోరుగా నడుస్తోంది. దీనిపై మంత్రులు జోక్యం చేసుకొని నిజానిజాలు బయట పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Similar News

News December 6, 2025

తూ.గో. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం: జేసీ

image

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News December 6, 2025

నాగర్‌కర్నూల్: ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’.. పోస్ట్‌ వైరల్‌

image

ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘మా ఇంటి ఓట్లు అమ్మబడవు’ అని ఇంటి యజమాని ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంబేడ్కర్ మనకు కత్తిని కాకుండా ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని, డబ్బుకు, మందుకు ఓటును అమ్ముకోవద్దని, మూర్ఖులవుతారో, రాజులవుతారో నిర్ణయం ప్రజల చేతిలోనే ఉందని ఆ ఫ్లెక్సీలో ప్రదర్శించారు.

News December 6, 2025

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్స్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC)-చెన్నై ఎగ్మోర్(MS) (నం.07146,47) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 6.40 గంటలకు SCలో బయలుదేరే ఈ ట్రైన్ 7న అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 8 గంటలకు MS చేరుకుంటుందన్నారు, 7న మధ్యాహ్నం 12.30కి MSలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ, 8న తెల్లవారుజామున 3కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.