News January 22, 2026
KNR: రేపే చివరి తేదీ

KNR బీసీ స్టడీ సర్కిల్‌లో IELTS ఉచిత శిక్షణకు అప్లై చేసుకున్న KNR, JGL, PDPL జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ బుధవారం ప్రారంభంకాగా రేపటితో ముగుస్తుందని డైరెక్టర్ రవి కుమార్ తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి హాజరుకాని వారు వెంటనే బీసీ స్టడీ సర్కిల్‌లో వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులందరూ వచ్చేటప్పుడు ఒరిజినల్‌తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.
Similar News
News January 24, 2026
సిద్దిపేట: చేనేత కార్మికులకు రుణ మాఫీ విడుదల

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసినట్లు జౌళి శాఖ సంచాలకులు సాగర్ తెలిపారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 7 మంది కార్మికులకు సంబంధించి రూ. 5 లక్షల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 24, 2026
కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ

TG: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరైన విషయాలను గులాబీ బాస్‌కు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో హరీశ్ రావు కూడా ఫామ్‌హౌస్‌కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
News January 24, 2026
WGL: ‘రూ.కోటి ఇస్తా ఛైర్మన్ చేయండి..!’

WGL జిల్లాలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆశావహుల హడావిడి మామూలుగా ఉండటం లేదు. తాజాగా వర్ధన్నపేట ఛైర్మన్ పదవి ఇస్తే రూ.కోటి ఇస్తానంటూ ఏకంగా డబ్బుల సంచితో సమావేశానికి రావటంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎదుట డబ్బులు చూపించి పదవి కావాలని అడిగాడట. గతంలో ఒక్క ఓటుతో తన భార్యను గెలిపించుకున్న వ్యక్తి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక్కడ ఛైర్మన్ (R)జనరల్.


