News November 29, 2024
KNR: రైతులకు డీలర్లు సరైన సూచనలు ఇవ్వాలి: కలెక్టర్
విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్‌పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కృషి భవనంలో ఇన్ పుట్ డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లమా కోర్సు శిక్షణ తరగతులను ప్రారంభించారు. 40 మంది డీలర్లకు సంవత్సరం పాటు వారానికి ఒకరోజు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News November 29, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్ర వారం రూ.3,09,170 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,57,173, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,13,510, అన్నదానం రూ.38,487,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
News November 29, 2024
సర్వే 100 శాతం పూర్తి చేయాలి: KNR కలెక్టర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ కారణాల రిత్యా అక్కడక్కడ కొన్ని ఇండ్లు మిగిలిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటి సర్వే పూర్తి చేయాలని అన్నారు. పూర్తయిన సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేసుకునేందుకు మండల ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
News November 29, 2024
రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాలింగార్చన
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహాలింగర్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ప్రమిదలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.