News November 6, 2024
KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి.. UPDATE

KNR జిల్లా రామడుగు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో <<14540335>>ఇద్దరు యువకులు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. SI శేఖర్ వివరాల ప్రకారం.. రామడుగుకు చెందిన అరుణ్(20), శివాజీ(18) ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్ద ఉంటున్నారు. అయితే నిన్న బైకుపై KNR వెళ్లి వస్తుండగా బొలెరో ఢీకొట్టడంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. చెట్ట పొదల్లో పడిన అరుణ్‌ను స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
Similar News
News November 3, 2025
మానకొండూరు: పాఠశాల దారి మూసేశారు..!

మానకొండూరు(M) గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారికి ఫెన్సింగ్ వేయడంతో విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి చదువుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు ఉన్న దారిని ఒక్కసారిగా ఎందుకు మూసేశారని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలా లేక రాజకీయ కారణాలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 2, 2025
చాలా రోజుల తర్వాత కనిపించిన కెప్టెన్

చాలా కాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆదివారం కనిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసి, బీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణరావు మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
News November 2, 2025
KNRలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు

KNR జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రేపు భారత వాయుసేనపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కమాండింగ్ ఆఫీసర్ షేక్ యాకుబ్ అలీ వాయుసేనలో చేరడం ఎలా, వాయుసేనలో అవకాశాలు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం, సిలబస్, పూర్తి సెలక్షన్ వివరాలను అభ్యర్థులకు వివరిస్తారని తెలిపారు. ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.


