News April 1, 2024
KNR: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1711986426779-normal-WIFI.webp)
ఇబ్రహీంపట్నం మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన వేముల దీక్ష (23) తన బావ దిలీప్‌తో కలిసి కథలపూర్ మండలం పోతారం గ్రామానికి బైక్‌పై వెళ్తోంది. ఈక్రమంలో రాళ్లలోడుతో వస్తున్న టిప్పర్ అతివేగంగా బైక్‌ను ఢీ కొంది. దీంతో దీక్ష టిప్పర్ వెనకాల చక్రాల్లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
Similar News
News January 15, 2025
విద్యుత్ కాంతులతో కొత్తకొండ వీరన్న ఆలయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736864497786_52030644-normal-WIFI.webp)
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం విద్యుత్ కాంతులతో సుందర దృశ్యంగా కనిపిస్తోంది. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నారు.
News January 14, 2025
GDK: ఇలాగైతే ప్రమాదాలు జరగవా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736853941082_50226861-normal-WIFI.webp)
గోదావరిఖని మాతంగి కాంప్లెక్స్ రోడ్డుపై ఓ పక్క రోడ్డు కుంగిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇటీవల రోడ్డుపై గుంత ఏర్పడి, క్రమక్రమంగా అది పెద్దగా అవుతుండటంతో గుర్తించేందుకు వీలుగా స్థానికులు దానికో గుడ్డ పీలిక చుట్టారు. ఇదంతా అధికారులు చూస్తున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
News January 14, 2025
KNR: ముగ్గులతో మొదలైన సంక్రాంతి సంబురాలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736845485314_60286071-normal-WIFI.webp)
KNR ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండుగ మొదలైంది. జిల్లాలో మహిళలు, ఆడపడుచులు ఉదయాన్నే 4 గంటలకు లేచి వాకిట్లో ముగ్గులు, రంగవల్లులతో పోటీపడ్డారు. తదనంతరం స్నానాలు ఆచరించి గోబ్బేమ్మలు, ధాన్యలతో, రేగిపండ్లతో ముగ్గులను అలంకరించి చిన్నపిల్లలకు బడబుడకలతో దిష్టిని తీశారు. దీంతో ఉదయం ముగ్గులతో పండుగ మొదలుకొని సాయంత్రం వరకు కొత్త అల్లుళ్ల దావత్‌లు, తీపి వంటకాలతో పండుగను జరుపుకుంటారు.