News September 22, 2025
KNR: రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి KNRవైపు వెళ్తున్న ఓ లారీ తాడికల్ గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడగా మరో మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. లారీ పాక్షికంగా దెబ్బతింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 22, 2025
గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందన

గాజులరామారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అక్కడ నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని వెల్లడించారు. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారన్నారు. ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని, కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని రంగనాథ్ తెలిపారు. కబ్జా చేసిన వాటిలో 30శాతమే కూల్చేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనన్నారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
News September 22, 2025
UPSC 213 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

UPSC 213 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్, అడిషనల్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్, డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్, డిప్యూటీ లీగల్ అడ్వైజర్, ఉర్దూ లెక్చరర్, మెడికల్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. మరింత సమాచారం కోసం ఇక్కడ<
News September 22, 2025
30న ఎడ్‌సెట్ స్పాట్ అడ్మిషన్స్

TG: B.Ed కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈనెల 30న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు రేపు https://edcetadm.tgche.ac.inలో అందుబాటులో ఉంటాయన్నారు. ర్యాంక్ కార్డు, టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కుల మెమోలు, ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.