News October 7, 2025

KNR: లోకల్ ఎలక్షన్స్ ముందు మంత్రుల పంచాయితీ ఏంటి?

image

అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, అందుకు అడ్లూరి రియాక్షన్‌తో కాంగ్రె‌స్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. గతంలో పొన్నం, శ్రీధర్ బాబు మధ్య ఆధిపత్యపోరు ఉండేది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మంత్రులు పొన్నం, వివేక్ వర్సెస్ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌గా సీన్ మారిందనే చర్చ మొదలైంది. అయితే స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్ ముందు వీరి పంచాయితీ ఏంటని కేడర్ నారాజులో ఉంది.

Similar News

News April 14, 2026

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News April 14, 2026

నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

image

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News April 14, 2026

జనగామ: ఇంటర్‌‌లో టైలర్‌ కూతురు భవానికి 988 మార్కులు!

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ(D) చిల్పూర్(M) చిన్న పెండ్యాలకు చెందిన పేరాల భవాని అద్భుత ప్రతిభ కనబరిచింది. తండ్రి ప్రభాకర్ టైలరింగ్ చేస్తూ చదివిస్తుండగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన భవాని టీఎస్‌ఆర్‌జేసీలో కష్టపడి చదివి 1000కి 988 మార్కులు సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యధిక మార్కులు సాధించిన భవానిని గ్రామస్థులు, పలువురు ప్రముఖులు అభినందించారు.