News August 31, 2025

KNR: వరద కాలువలో గల్లంతైన రహీం మృతదేహం లభ్యం

image

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.

Similar News

News August 31, 2025

KNR: నిజాయితీకి చిరునామా.. ఆటో డ్రైవర్ రాజేందర్

image

కరీంనగర్‌లోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్, గీతాభవన్ వద్ద ఓ ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగును తిరిగి అందజేశాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రయాణికుడు దిగిన చోటికి వెళ్లి బ్యాగును సురక్షితంగా అప్పగించాడు. రాజేందర్ నిజాయితీని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.

News August 31, 2025

KNRలో గిరిజన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

image

HYDలో జరిగే చర్చా గోష్టికి వెళ్తున్న గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, శివరాజులను కరీంనగర్‌లో పోలీసులు ఆదివారం హౌస్ అరెస్టు చేశారు. దీంతో గిరిజన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా, లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలని కుట్రపూరితంగా కోర్టులో కేసు వేసిన సోయం బాపూరావు, వెంకటరావులను అరెస్టు చేయకుండా తమను అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు.

News August 31, 2025

KNR: మహిళల పాత్ర అత్యంత కీలకం: మౌలానా

image

KNRలోని నేషనల్ ఫంక్షన్ హాల్‌లో సిటీ జమాత్ ఉలమా ఆధ్వర్యంలో నిర్వహించిన సీరత్ రసూల్ సభలో ప్రధాన వక్తగా హజ్రత్ మౌలానా అతిఖ్ అహ్మద్ ఖాస్మి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ,, కుటుంబం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దైవ ప్రవక్త బోధనలు అమలుపరిస్తేనే సమాజంలో శాంతి, న్యాయం, ఐక్యత సాధ్యమవుతుందని వివరించారు. మహిళలు తాలీం (విద్య), తర్బియత్ (పరిగణన, ఆచరణ) విషయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.