News December 19, 2025
KNR: వరుసగా చెక్ డ్యాంల ధ్వంసం.. చర్యలేవీ..?

చెక్ డ్యాంలను ఇసుక మాఫియా ధ్వంసం చేస్తుందా లేక నీటి ప్రవాహానికి కూలుతున్నాయా అనే విషయాన్ని అధికారులు తేల్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియా బ్లాస్ట్ చేశాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా ప్రభుత్వం విచారణ పేరుతో జాప్యం చేస్తుందన్న విమర్శలొస్తున్నాయి. నిన్న అడవిసోమన్పల్లి, ఇటీవల గుంపుల చెక్ డ్యాం కూలిన ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నా ఇసుక అక్రమ రవాణా కట్టడిపై చర్యలు లేకపోవడం గమనార్హం.
Similar News
News December 26, 2025
WGL: ప్రమాదాల నివారణకు పోలీసుల హెచ్చరిక

దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై దృశ్యమానత తగ్గుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు సూచించారు. నెమ్మదిగా డ్రైవ్ చేయడం, ఫాగ్ లైట్లను ఉపయోగించడం, ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించడం, పొగమంచులో ఓవర్ టేకింగ్‌ను చేయొద్దని పేర్కొన్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు చెప్పారు.
News December 26, 2025
వేరుశనగలో ఈ అంతర పంటలతో మేలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.
News December 26, 2025
సూర్యాపేట: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: డీఈఓ

2025-26 రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శణి (RSBVP)-ఇన్‌స్పైర్ మానక్ (DLEPC) జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ అశోక్ తెలిపారు. ఈ నెల 30, 31 తేదీల్లో హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుంచి పాల్గొనే విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ ఫామ్‌ను నింపి రెండు జతలు, ఒక రైట్ అప్‌తో పాటు కౌంటర్‌లో అందజేయాలన్నారు.


