News January 4, 2026
KNR: వాట్సాప్‌లో డబ్బులు అడిగితే నమ్మకండి..!

స్నేహితుడి వాట్సాప్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఓ యువకుడిని బురిడీ కొట్టించారు. KNR(D) జమ్మికుంటకు చెందిన నోముల కీర్తికుమార్‌కు తన ఫ్రెండ్ బాలరాజు పేరుతో ‘అకౌంట్ పనిచేయడం లేదు.. అర్జెంటుగా డబ్బులు కావాలి’ అని వాట్సాప్‌లో సందేశం వచ్చింది. అది నిజమని నమ్మిన కీర్తికుమార్, సదరు నంబర్‌కు గూగుల్ పే ద్వారా రూ.65,000 పంపాడు. అనంతరం మిత్రుడికి ఫోన్ చేయగా, తన ఫోన్ హ్యాక్ అయిందని చెప్పడంతో బాధితుడు లబోదిబోమన్నాడు.
Similar News
News February 17, 2026
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.
News February 17, 2026
ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్‌కు మోదీ ఆహ్వానం

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
News February 17, 2026
భూపాలపల్లి: ఫిబ్రవరి 21 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

భారత పత్తి సంస్థ మద్దతు ధర పత్తి కొనుగోళ్లు 21.02.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తెలిపింది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ పత్తి అమ్మని రైతులు 20.02.2026 లోగా సమీప కొనుగోలు కేంద్రంలో కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


