News August 23, 2025
KNR: విద్యార్థినులను కరిచిన ఎలుకలు..!

విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపరిచిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చోటు చేసుకుంది. విద్యార్థినులు రాత్రి పడుకున్న తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఎలుకలు వారిని గాయపరిచాయి. ఈ సంఘటనలో 10 మంది విద్యార్థినుల వరకు గాయపడినట్లు సమాచారం. మిగతా విద్యార్థులు ఈ విషయం ఉపాధ్యాయులకు తెలియజేయడంతో గాయపడ్డవారికి గోప్యంగా స్థానిక PHCలో చికిత్స అందించారు.
Similar News
News August 23, 2025
తాడ్వాయి: కనుమరుగైన మంచెలు

వ్యవసాయ బావుల వద్ద మంచెలు కనుమరుగయ్యాయి. గత 20 ఏళ్ల క్రితం వ్యవసాయ బావుల వద్ద రైతులు కట్టెలతో మంచెలు వేసుకొని సాగుచేసిన పంటలకు కాపలా కాసేవారు. అంతేకాకుండా క్రిమి కీటకాల నుంచి రక్షణగా మంచెలు ఉండేవి. కాపలా అనంతరం మంచెపై కూర్చుని భోజనం చేసి రైతులు సేద తీరేవారు. అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు రైతులకు వ్యవసాయ బావుల వద్ద లేకుండా పోయింది. మంచెల గురించి పలువురు రైతులు గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు.
News August 23, 2025
పోలీస్ నుంచి టీచర్‌గా..

మెగా డీఎస్సీ ఫలితాల్లో అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మం. జూటూరుకు చెందిన వసుంధర సత్తా చాటారు. జిల్లా స్థాయిలో 59వ ర్యాంకుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలి (SGT)గా ఎంపికయ్యారు. అయితే వసుంధర ఇప్పటికే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పుట్లూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో పనిచేశారు. ప్రజల రక్షణలో కీలకంగా పనిచేస్తూ లక్ష్యాన్ని మరవకుండా టీచర్ జాబ్ సాధించారు.
News August 23, 2025
నేడు ఖాతాల్లోకి డబ్బులు

AP: 2014-19 మధ్య జరిగిన నరేగా(ఉపాధి హామీ పథకం) పనుల బిల్లులు ఇవాళ విడుదల కానున్నాయి. క్లోజ్ చేసిన 3,54,177 పనులను CM చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారని TDP తెలిపింది. దీంతో ₹180Cr చెల్లింపులకు మార్గం ఏర్పడిందని, అందులోంచి ₹145Cr ఇవాళ కాంట్రాక్టర్లు, కార్మికుల ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. YCP ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని ఆరోపించింది.