News July 11, 2025
KNR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది: USFI

KNR జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని USFI (యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) డిమాండ్ చేసింది. ఈ మేరకు USFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు DIEOకి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. అక్రమంగా నడుస్తున్న ఈ కళాశాలల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News February 11, 2026
హుజురాబాద్‌లో 81.47% పోలింగ్ నమోదు

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి 81.47% శాతం పోలింగ్ నమోదైంది. గత 2020ఎన్నికల్లో నమోదైన 77.8 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ శాతం పెరగడం ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్లు సూచిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని చెప్పారు.
News February 11, 2026
కరీంనగర్: ‘అభ్యర్థి సస్పెన్షన్ వార్తల్లో నిజం లేదు’

కరీంనగర్ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 242వ బూత్‌లో ఓ అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేశారంటూ సాగుతున్న ప్రచారపై కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, రిటర్నింగ్ అధికారి ఎవరిని సస్పెండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని, పోలింగ్ ప్రక్రియ సజావుగానే సాగిందని తెలిపారు.
News February 11, 2026
హుస్నాబాద్: 84.21 శాతం పోలింగ్

హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డులలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో మొత్తం 19,277 మంది ఓట్లకు గాను 16,192 (84.21%) ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు (7916), మహిళలు (8272), ఇతరులు (4) ఓటు వేశారు. పోలీసులు ఉదయం నుంచి పటిష్ట బందోబస్తు నిర్వహించగా, పోలింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు బంద్ చేశారు.


