News August 21, 2025
KNR: వృద్ధులపై కఠినంగా బిడ్డలు

పింఛన్, ఆస్తి.. కారణమేదైనా మలిదశలో తల్లిదండ్రులను కాదనే ప్రభుద్ధులెందరో ఉమ్మడి KNRలో ఇప్పటికీ ఉన్నారు. కొన్నినెలల క్రితం JGTL(D)వెల్గటూర్, రాయికల్, కోరుట్లల్లో వివిధకారణాలతో బిడ్డల నుంచి భరోసా కరవై వృద్ధులు రోడ్డెక్కారు. తాజాగా KNR(D)శంకరపట్నం మొలంగూర్లో ఓ కొడుకు<<17470521>> తల్లిని బయటకు గెంటేసి<<>> ఇంటికి తాళమేసుకున్నాడు. ఇలాంటి బాధితులు RDOలు, పోలీసులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను కలిసి న్యాయం పొందొచ్చు.
Similar News
News August 21, 2025
నలుగురికి పదేళ్ల జైలు శిక్ష: అనకాపల్లి SP

గంజాయి రవాణాలో నిందితులైన నలుగురికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం జిల్లా కోర్టు జడ్జి హరిహర నారాయణ గురువారం తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2015 మార్చి 12న 120 కిలోల గంజాయి రవాణా చేస్తూ జె.రమణ, డీ.మాణిక్యం, జె.నూకరాజు, కె.భూలోక పట్టుబడినట్లు చెప్పారు. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందని వెల్లడించారు.
News August 21, 2025
పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర

TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర మొదలవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతర పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. రూ.2,198 కోట్ల విలువైన 1.01 లక్షల పనులు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, పొలాలకు మట్టి రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, అంతర్గత సీసీ రోడ్లు, వాటర్ షెడ్లు, పశువుల కొట్టాలు, నర్సరీల పెంపకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, తదితర పనులు చేపడతామన్నారు.
News August 21, 2025
ఆసియా కప్‌లో యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్‌లు!

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్‌లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్‌లో గానీ ఎలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనరని చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించి న్యూట్రల్ వేదికల్లో ఇరు దేశాలు తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆసియా కప్ UAEలో జరగబోతోంది. అంటే ఇందులో IND-PAK మధ్య పోరు ఉంటుందని స్పష్టమవుతోంది.