News October 19, 2025

KNR: వైద్యాధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్‌లో శనివారం జిల్లా వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్యాధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, ఆసుపత్రుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News October 19, 2025

కరీంనగర్‌లో 22న జాబ్ మేళా.!

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి తిరుపతి రావు తెలిపారు. వరుణ్ మోటార్స్ సంస్థలో ఉన్న 50 పోస్టులకు ITI, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు 20-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని అన్నారు. వేతనం రూ.10 వేల నుంచి ప్రారంభమౌతుందని, ఆసక్తి గలవారు 22న పేరు నమోదు చేసుకోవాలన్నారు. 8143865009, 9963177056, 8886619371, 7207659969కు సంప్రదించాలన్నారు.

News October 18, 2025

KNR: మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘనపై కొరడా

image

KNR కమిషనరేట్ పరిధిలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు CP గౌష్ ఆలం తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్న 301 మంది వాహనదారుల నుంచి మొత్తం రూ.64,39,715 జరిమానా వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగ్ చలానాలు కలిగిన వాహనదారులు వాటిని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదుచేస్తామని CP హెచ్చరించారు.

News October 18, 2025

KNR: ‘చట్టాలపై అవగాహన అవసరం’

image

తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.