News December 20, 2025
KNR: శాతవాహన వృక్షశాస్త్ర విద్యార్థుల క్షేత్ర పర్యటన

శాతవాహన విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర విద్యార్థులు శైవలాల సేకరణలో భాగంగా దిగువ మానేరు డ్యామ్‌ను వృక్షశాస్త్ర విభాగాధిపతి డా.సాయిని కిరణ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఇందులో భాగంగా శైవలాల సేకరణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా భద్రపరచాలి, వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేస్తూ క్షేత్ర పర్యటన లక్ష్యాలను, శైవలాల ఆవశ్యకతను అధ్యాపకులు డా. అభినేష్, డా.శివకుమార్ విద్యార్థులకు వివరించారు.
Similar News
News December 21, 2025
యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలి: నిర్మల్ కలెక్టర్

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యూరియా యాప్ వినియోగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు సులభంగా యూరియా పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
News December 21, 2025
వరంగల్: కనీస వసతులు లేక చలికి వణుకుతున్న విద్యార్థులు!

WGL జిల్లాలో చలి తీవ్రత పెరిగి ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు కనీస వసతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ SC, ST, BC కళాశాలల్లోని వసతి గృహాల్లో కిటికీలకు తలుపులు లేక తట్టు బస్తాలు అడ్డు కట్టారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పడకలు లేక నేలపై నిద్రిస్తున్నారని, దుప్పట్లు ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాగా, పై చిత్రం WGL రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలోనిది.
News December 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


