News August 23, 2024
KNR: శిలాఫలకంపై ఎంపీ పేరు ఏది!
మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించిన జీడికే -5 ఓసీపీ సైట్ ఆఫీస్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిలాఫలకం ప్రారంభించే వరకు అందులో ఎంపీ పేరులేదన్న విషయం ఎవరికీ తెలియలేదు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడాన్ని గుర్తించిన ఎంపీ.. సింగరేణి అధికారులను ఆరాతీసినట్లు సమాచారం.
Similar News
News November 26, 2024
పెద్దపల్లి: దారుణం.. విద్యార్థినితో నగ్న పూజకు యత్నం!
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఓ బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్న పూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హాస్టల్లో పని చేసే వంట మనిషి నగ్న పూజ చేస్తే కనకవర్షం కురుస్తుందని ఓ బాలికతో చెప్పింది. దీంతో భయాందోళనకు గురైన ఆ బాలిక వెంటనే తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 26, 2024
కోరుట్ల: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్
NZB జిల్లా న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. NZBకు చెందిన కాంత్రికుమార్కు కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్ద కూతురు నేహశ్రీకి మానసిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది కూతురితో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
News November 26, 2024
కరీంనగర్లో పెరిగిన చలి.. జాగ్రత్త!❄
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 4 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త! SHARE IT