News January 15, 2026
KNR: సంక్రాంతి, మేడారం ఎఫెక్ట్.. మేకలకు భలే గిరాకీ!

సంక్రాంతి, మేడారం జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ పెరిగింది. గురువారం మంథనిలోని ఫ్లైఓవర్ వంతెన సమీపంలో వ్యాపారులు మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారులు అధిక రేట్లు వసూలు చేస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మరోవైపు, ప్రధాన రహదారిపైనే విక్రయాలు జరగడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.
Similar News
News February 16, 2026
శ్రీకాళహస్తిలో లాఠీఛార్జ్ చేయలేదు: SP

శ్రీకాళహస్తి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా <<19157006>>భక్తులపై లాఠీఛార్జ్<<>> జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఖండించారు. నంది వాహన ఊరేగింపులో కొందరు మాలధారులు క్రమశిక్షణా రాహిత్యంతో వాహనాన్ని బలవంతంగా మోసే ప్రయత్నం చేయడంతో ప్రమాద పరిస్థితి తలెత్తిందన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు నియంత్రణ చర్యలు మాత్రమే తీసుకున్నారని, ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదని స్పష్టం చేశారు.
News February 16, 2026
బీజేపీ నేతకు హీరోయిన్ త్రిష వార్నింగ్

అనవసర వివాదాల్లోకి తనను లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హీరోయిన్ త్రిష హెచ్చరించారు. తమిళ హీరో విజయ్‌ని ఉద్దేశించి తనపై బీజేపీ నేత <<19138607>>నాగేంద్రన్<<>> చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ప్రతిష్ఠను దెబ్బతీశారన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 16, 2026
మరో పాన్‌ఇండియా మూవీలో సూపర్ స్టార్?

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్‌లు హోంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకే వీరి సమావేశం జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.


