News March 26, 2025
KNR: సరైన అవగాహన.. సైబర్ నేరాలకు నివారణ

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై రైసింగ్ సన్ యూత్ క్లబ్ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్‌లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుందని అన్నారు.
Similar News
News March 29, 2025
పెద్దపల్లి: పరువు హత్య UPDATE..

పెద్దపల్లి(D) ఎలిగేడు(M) ముప్పిరితోటలో ప్రేమ వ్యవహారంతో యువకుడి హత్య కేసుకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. A-1 ముత్యం సదయ్య (యువతి తండ్రి), A-2 ముత్యం సమత (యువతి తల్లి), A-3 సిద్ధ సారయ్య (యువతి మేనమామ) పై హత్య కేసు నమోదు చేశారు. హత్యకు ప్రేరేపించిన ఇతరులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 29, 2025
బ్యాంకాక్‌లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.
News March 29, 2025
కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో 41.2°C నమోదు కాగా, కరీంనగర్ రూరల్, గంగాధర మండలాల్లో 40.9, ఇల్లందకుంట, మానకొండూర్ 40.7, చిగురుమామిడి 40.6, జమ్మికుంట, తిమ్మాపూర్ 40.5, శంకరపట్నం 40.3, రామడుగు 40.2, గన్నేరువరం 40.0, కొత్తపల్లి 39.9, సైదాపూర్ 39.3, చొప్పదండి 39.2, వీణవంక 39.0, హుజూరాబాద్ 38.3°C గా నమోదైంది.