News July 7, 2025

KNR: సర్కార్ స్కూల్ చిన్నారులకు కేంద్రమంత్రి శుభవార్త

image

కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీతో పాటు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కిట్స్ అందజేయనున్నారు. KNR లోక్‌సభ పరిధిలోని 50-60వేల చిన్నారులకు స్కూల్ బ్యాగ్, నోటు బుక్స్, పెన్స్, పెన్సిల్, వాటర్ బాటిల్, షూ కిట్‌ను అందించేస్తారని SGTU నేతలు తెలిపారు. ఒక్కొక్కరికి ₹1000 విలువైన కిట్లు అందనున్నాయి. ఈ సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News July 7, 2025

రేపే అరుణాచలం యాత్ర బస్సు ప్రయాణం: GDK – DM

image

కాణిపాకం, అరుణాచలం, జోగులాంబ, గోల్డెన్ టెంపుల్ వీక్షించే యాత్రికులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మంగళవారం ఈ బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు బుకింగ్ కోసం 7013504982 ను సంప్రదించాలని కోరారు. ఈ యాత్రకు రాజధాని AC బస్సు సమకూర్చామన్నారు. ఛార్జీలు పెద్దలకు ₹5900, పిల్లలకు ₹4900గా నిర్ణయించామన్నారు.

News July 7, 2025

పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 7, 2025

శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

image

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.