News October 8, 2025
KNR: సర్దుకుపోతారా..? సాగదీస్తారా..?

మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్‌పై చేసిన వ్యాఖ్యలు CONGలో ప్రకంపనలు సృష్టించాయి. రంగంలోకి దిగిన PCC చీఫ్ మహేష్ గౌడ్ నేడు ఇరువురితో మాట్లాడనున్నారు. ఇప్పటికే నేనెవర్నీ ఏం అన్లేదని పొన్నం, తననుద్దేశించే మాట్లాడాడని అడ్లూరి అంటున్నారు. ఇవే మాటలపై ఇద్దరు మంత్రులుంటే సీన్ కంటిన్యూ అయ్యే అవకాశముంది. కాగా, పార్టీ పెద్దలు మంత్రులకు నచ్చజెప్పి గొడవకు ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.
Similar News
News October 8, 2025
దళితుల్ని ఇంకా చులకనగానే చూస్తున్నారు: మాజీమంత్రి

దళితులు ఏ స్థాయికి ఎదిగినా వారిని ఇంకా చులకనగానే చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటిదాకా వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ BR గవాయ్, రాష్ట్ర దళిత మంత్రిపై వ్యాఖ్యలు సమాజానికి అవమానమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
News October 8, 2025
వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ రాసుకోవాలా?

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్‌స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. సన్‌స్క్రీన్ ఎంచుకొనేటప్పుడు Broad-spectrum , SPF50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.
News October 8, 2025
విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ తీర్మానించింది: గంటా

విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా తన ఉత్తరాంధ్ర సమావేశంలో తీర్మానం చేసిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలో తాము జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు దర్శి, సత్తెనపల్లి వంటి అనేక ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ వైకాపా మాత్రం విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.