News December 10, 2025
KNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాలకు నగరవాసులు

ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా పలు మండలాల్లో రేపు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పట్టణాల్లో ఉంటున్న వాసులు పెద్దసంఖ్యలో తమ గ్రామాలకు పోలింగ్‌కు ముందే చేరుకుంటున్నారు. అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్, ప్రయాణ ఖర్చుల భరోసా వంటి కారణాలతో గ్రామాలవైపు రద్దీ పెరిగింది. స్నేహితులు కూడా పరస్పరం సంప్రదించుకుని కలిసి వెళ్లే ఏర్పాట్లు చేస్తుండగా పలువురు ఉద్యోగులు సెలవులు తీసుకుని స్వగ్రామాలకు చేరుతున్నారు.
Similar News
News December 11, 2025
సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం: పవన్

AP: గతంలో ఎన్నడూ లేని విధంగా 10వేల మందికి పైగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని Dy.CM పవన్ అన్నారు. ‘ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి. నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. గత ప్రభుత్వంలో పోస్టింగ్, ప్రమోషన్‌కు ఓ రేటు కార్డు ఉండేది. కూటమి పాలనలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం’ అని ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో ఆయన అన్నారు.
News December 11, 2025
BHPL: ఓటు హక్కు వినియోగానికి ఇవి తప్పనిసరి: కలెక్టర్

ఈనెల 11, 14, 17వ తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా చూపించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఓటర్, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇండియన్ పాస్‌పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, రేషన్ కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లాలని సూచించారు..
News December 11, 2025
MHBD: నాన్నపై ప్రేమతో!

MHBD(D) కొత్తగూడ(M) వెలుబెల్లికి చెందిన రాజు తన తండ్రిపై ఉన్న ప్రేమను అద్భుతంగా చాటుకున్నాడు. కొన్ని నెలల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, బాధను దిగమింగుకుని వినూత్నంగా నివాళులర్పించాడు. తమ పొలంలో నారుమడి వేస్తూ ఏకంగా తన తండ్రి ఎల్లయ్య పేరునే నారుతో తీర్చిదిద్దాడు. ఈ భావోద్వేగ ఘట్టం ఇప్పుడు ఆ ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రిపై కొడుకు చూపిన ఈ ప్రేమాభిమానం పలువురిని కదిలిస్తోంది.


