News July 10, 2025
KNR: సివిల్స్ ఉచిత శిక్షణకు 12న ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్

సివిల్స్ ఉచిత శిక్షణ కోసం ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 12న నిర్వహించనున్నామని కరీంనగర్ జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ ఈరోజు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 0878-2268686 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Similar News
News July 11, 2025
త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
News July 11, 2025
రూ.180 కోట్ల చెల్లింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ ఫైళ్లను మూసివేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో రూ.180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులను కేంద్రం రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని వివరించింది.
News July 11, 2025
KNR: దుర్గాభవాని అమ్మవారికి కూరగాయలు, ఆకుకూరల అలంకరణ

కరీంనగర్ నగునూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకాంబరీ ఉత్సావాలలో భాగంగా గురువారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజారులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజలలో ఆలయ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.