News September 6, 2025
KNR: ‘స్థానికం’లో BRSకు కవిత ‘ఎఫెక్ట్’..!

స్థానిక ఎన్నికల సమయంలో BRSకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం CBIకి కేసు బదలాయించగా కవిత తాజా ఎపిసోడ్ BRSను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఏకంగా పార్టీలోని ముఖ్యులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీంతో స్థానిక పోరులో BRSకు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశముందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తద్వారా BRS నుంచి బరిలో నిలిచే ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News September 6, 2025
HYD: అప్రమత్తమైన అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

గణేశ్ నిమజ్జనాలు సురక్షితంగా జరిగేలా తెలంగాణ అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన సరస్సులు, బేబీ పాండ్స్ వద్ద ఫైర్ టెండర్లు, క్రేన్లు, బోట్లు, శిక్షణ పొందిన ఈతగాళ్లతో బృందాలను సిద్ధంగా ఉంచారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ బృందాలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News September 6, 2025
కవిత ఆరోపణల తర్వాత తొలిసారి కేసీఆర్‌తో హరీశ్ భేటీ

TG: కవిత సంచలన ఆరోపణల తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు తొలిసారి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. ఇందులో కవిత అంశం చర్చకు వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా హరీశ్‌పై ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
News September 6, 2025
JGTL: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సంజీవరెడ్డి

కథలాపూర్ మండలం గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న నల్ల సంజీవరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సంజీవరెడ్డి మండలంలోని గంభీర్పూర్, అంబర్పేట జడ్పీ హైస్కూళ్లలో సంజీవరెడ్డి ఇంగ్లీష్ టీచర్‌గా వినూత్నంగా బోధిస్తూ విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారని ఉపాధ్యాయులు తెలిపారు. ఆయనకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు.