News July 30, 2024
KNR: స్థానిక ఎన్నికలు.. ఓటరు జాబితాకు కసరత్తు
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేయనుంది. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఓటర్ల జాబితా తయారీ కోసం ఎంపిక చేసి ఓటర్ల జాబితా తయారీపై హైదరాబాద్‌లో వారికి ఒక రోజు శిక్షణ ఇవ్వనుంది.
Similar News
News November 27, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,941 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,09,814 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.81,660, అన్నదానం రూ.41,467 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
News November 27, 2024
రాజన్న స్వామివారి హుండీ ఆదాయం వివరాలు ఇవే
వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి 32 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1,50,24,507 వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. బంగారం 170 గ్రాములు రాగావెండి 9 కిలోల 800 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. హుండీ లెక్కింపులో ఈవో వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, శ్రీరాజరాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.
News November 27, 2024
ఎంఈవోలు రోజుకో పాఠశాల సందర్శించాలి: కలెక్టర్ పమేలా
తమ మండలంలోని రోజుకో పాఠశాల సందర్శిస్తూ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఎంఈఓలకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సరుకుల నిల్వ గది, రికార్డులు పరిశీలించి నాణ్యత పాటించేలా చూడాలన్నారు.