News October 7, 2025

KNR: హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో ఉత్కంఠ..!

image

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి KNRలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.

Similar News

News October 7, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

image

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్‌ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

News October 7, 2025

NLG: ఇండ్లు అద్దెకు తీసుకొని.. హైటెక్ వ్యభిచారం!

image

ఉమ్మడి జిల్లాలో వ్యభిచారం విచ్చలవిడిగా నడుస్తున్నది. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేస్తున్నా అక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. KDD, SRPT, MLG, NLG వంటి ప్రాంతాల్లో ఇప్పుడు హైటెక్‌ హంగులతో కొందరు యథేచ్ఛగా వ్యభిచారం నడిపిస్తున్నారు. నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా ఇండ్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

News October 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. BJP లిస్ట్‌లో నందమూరి సుహాసిని పేరు..?

image

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. పోటీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. లంకాల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, నందమూరి సుహాసిని సహా ఏడుగురి పేర్లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్‌లో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.