News October 16, 2025
KNR: 20 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
KNR: జిల్లా కలెక్టర్‌తో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ పమెలా సత్పతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ వానాకాలంలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నామని తెలిపారు. 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
News October 15, 2025
KNR: గుండెపోటు.. ఆ క్షణాలు చాలా కీలకం

గుండెపోటు సమయంలో అవలంబించవలసిన CPR(కార్డియో పల్మనరీ రెసీసీకేషన్) పద్ధతిపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 13 నుంచి 17 వరకు CPR అవగాహన వారోత్సవాల సందర్భంగా KNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ నిర్వహిస్తున్నారు. బుధవారం కలెక్టర్ హాజరై మాట్లాడారు. గుండెపోటు సంభవించిన సమయంలో మొదటి కొన్ని గోల్డెన్ సెకండ్లు వృథా చేయవద్దన్నారు.
News October 15, 2025
కరీంనగర్: ‘న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి’

KNR కలెక్టరేట్ ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీ.ఆర్.గవాయ్‌పై బూటు విసిరిన ఘటనకు నిరసనగా అంబేద్కర్ వాదులు దీక్ష చేపట్టారు. తలారి సుధాకర్, కునమల్ల చంద్రయ్య సహా పలువురు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీం కోర్టులో రాకేశ్ కిషోర్ చేసిన ఈ చర్యను వారు తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు