News June 16, 2024
KNR: 22న HCA టాలెంట్ హంట్
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.
Similar News
News September 18, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ కథలాపూర్ మండల కేంద్రంలో నిలిపి ఉన్న బైక్ నుండి లక్ష 68 వేల నగదు చోరీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజా పాలన దినోత్సవం. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విశ్వకర్మ జయంతి. @ జగిత్యాల, కోరుట్ల పట్టణాలలో వైభవంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన వేడుకలు. @ జగిత్యాల, కోరుట్ల గణేష్ నిమజ్జన వేడుకలను పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్.
News September 17, 2024
ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొన్నం
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ MLA పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి,
సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2024
KNR: అనుమానాస్పద స్థితిలో సింగరేణి ఉద్యోగి మృతి
గోదావరిఖని జీఎం కాలనీ సింగరేణి కార్మికుడు హరినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న జీడీకే-1 ఇంక్లైన్‌కి చెందిన బానోతు హరినాథ్ సింగ్ తన క్వార్టర్లో మృతి చెందాడు. అయితే మృతుడి మెడపై గాయాలు ఉండటంతో.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.