News June 16, 2024

KNR: 22న HCA టాలెంట్ హంట్

image

ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.

Similar News

News December 27, 2025

కరీంనగర్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా

image

2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన లెప్రసీ, పల్స్‌ పోలియో బిల్లులను చెల్లించాలని శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆశావర్కర్లు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ బిల్లులపై డీఎంహెచ్‌ఓ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించే వరకు పోరాడుతామన్నారు.

News December 27, 2025

సర్పంచ్‌లే గ్రామాభివృద్ధి సారథులు: మంత్రి పొన్నం

image

కరీంనగర్ డీసీసీలో నూతన కాంగ్రెస్ సర్పంచ్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభివృద్ధి నిధులు త్వరలో వస్తాయని భరోసానిచ్చారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రేపు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

News December 27, 2025

సహకార రంగ బలోపేతమే దేశాభివృద్ధికి మూలం: ఈటల

image

సహకార వ్యవస్థ బలోపేతంతోనే దేశం ముందుకు సాగుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. KNRలో జరిగిన డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్నారు. రవీందర్ రావు డీసీసీబీ టర్నోవర్‌ను రూ.400 కోట్ల నుంచి రూ. 8 వేల కోట్లకు చేర్చడం స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.