News February 22, 2025
KNR: 27 న పోలింగ్.. జోరుగా ఎన్నికల ప్రచారం..!

ఈ నెల 27న జరుగబోయే KNR-MDK-NZB-ADLB MLC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించడంతో పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పట్టభద్రుల, టీచర్స్ విభాగల్లో ఆయా పార్టీల MLC అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలంటూ లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.
Similar News
News November 23, 2025
పల్నాడు ఉత్సవాల్లో అపశ్రుతి

పల్నాడు ఉత్సవాల్లో ఆదివారం ముగింపు వేళ విషాదం చోటుచేసుకుంది. నాగులేరులో స్నానాలు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ ఆకస్మికంగా తెగి పడటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
రూ.485కే 72 రోజుల ప్లాన్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్లో ఉన్నాయి.
News November 23, 2025
నిర్మల్: రేపు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన

రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (జిల్లా ఇన్చార్జి మంత్రి) రేపు జిల్లాలో పర్యటించనున్నారు. సోన్ మండలం లిఫ్ట్ పోచంపాడు ప్రభుత్వ పాఠశాలలో ఆస్ట్రానమీ ల్యాబ్ను ప్రారంభించడంతోపాటు, పాఠశాల మరమ్మతులను ప్రారంభించనున్నారు. అలాగే ముధోల్ నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.


