News February 22, 2025

KNR: 27 న పోలింగ్.. జోరుగా ఎన్నికల ప్రచారం..!

image

ఈ నెల 27న జరుగబోయే KNR-MDK-NZB-ADLB MLC ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను ఆదేశించడంతో పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పట్టభద్రుల, టీచర్స్ విభాగల్లో ఆయా పార్టీల MLC అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలంటూ లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది.

Similar News

News July 6, 2025

NZB: VRకు ఏడుగురు SI

image

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.

News July 6, 2025

జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.