News August 24, 2025
KNR: 4 గంటలకు రెండో విడత జనహిత పాదయాత్ర

గంగాధర మండలం ఉప్పర మల్యాలలో కాంగ్రెస్ పార్టీ రెండో విడత జనహిత పాదయాత్ర సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఉప్పర మల్యాలలో పాదయాత్ర ప్రారంభమై గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద ముగుస్తుంది. మధురానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు.
Similar News
News August 24, 2025
అప్పుడు ఊరికి ఓ గణపతి.. నేడు వీధికొకటి!

ఇరవై ఏళ్ల కిందట వినాయక చవితికి ముందు 3రోజులు, ఆ తర్వాత నిమజ్జనం దాకా గ్రామాల్లో సందడి మామూలుగా ఉండేది కాదు. చందాలు సేకరించి ఊరంతటికీ కలిపి ఓ విగ్రహాన్ని సెలక్ట్ చేయడం, మండపాల నిర్మాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు అని ప్లాన్ చేసేవాళ్లు. కానీ ఆ తర్వాత వీధికొక విగ్రహం ఏర్పాటు చేస్తుండటం వల్ల ఊరంతా కలిసి సంబరాలు చేసుకొనే కల్చర్ మాయమవుతోందని ముఖ్యంగా 90’s కిడ్స్ ఫీలవుతున్నారు. మీ COMMENT.
News August 24, 2025
బీసీ రిజర్వేషన్లు.. గాంధీభవన్ కీలక నిర్ణయం ?

రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News August 24, 2025
కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు హాజరవుతారు. అర్జీలు, పాత స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పారు. కాల్ సెంటర్ 1100 లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కోరారు.