News December 16, 2024
KNR: ACBకి చిక్కిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డాడు. నాలుగు మామిడి చెట్లు తరలించడానికి ఎన్వోసీపై సంతకం చేయడానికి రూ. 4,500 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
Similar News
News February 5, 2025
KNR: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీ ఫాం అందజేత
కరీంనగర్, NZBD, ADLBD, MDK పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి బీఫాంను బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందజేశారు. తనపై పార్టీ నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంజిరెడ్డి తరఫున బీ ఫాంను ఆయన కుమార్తె తీసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
News February 5, 2025
కరీంనగర్: జర్నలిస్టుల టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా శాఖ 2025 డైరీ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన 2025 డైరీని స్థానిక యూనియన్ కార్యాలయం ప్రెస్ భవన్ లో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ ఆవిష్కరించారు. జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ ఉపయోగపడే విధంగా డైరీని ముద్రించామని తెలిపారు.
News February 5, 2025
రామడుగు: పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గత కొద్ది రోజుల క్రితం రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట వీరాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.