News December 16, 2024

KNR: ACBకి చిక్కిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాలుగు మామిడి చెట్లు తరలించడానికి ఎన్‌వోసీపై సంతకం చేయడానికి రూ. 4,500 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Similar News

News February 5, 2025

కరీంనగర్: జర్నలిస్టుల టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా శాఖ 2025 డైరీ ఆవిష్కరణ

image

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ ముద్రించిన 2025 డైరీని స్థానిక యూనియన్ కార్యాలయం ప్రెస్ భవన్ లో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ ఆవిష్కరించారు. జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అందరికీ ఉపయోగపడే విధంగా డైరీని ముద్రించామని తెలిపారు.

News February 5, 2025

రామడుగు: పోలీస్ స్టేషన్‌లో తీన్మార్ మల్లన్న‌పై ఫిర్యాదు

image

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గత కొద్ది రోజుల క్రితం రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బుధవారం రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట వీరాంజనేయ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

error: Content is protected !!