News October 29, 2025

KNR: AIతో మార్ఫింగ్‌.. బాలికలపై లైంగిక వేధింపులు..!

image

గంగాధర మం. కురిక్యాల ZPHSలో బాలికలతో అటెండర్ దిగిన ఫొటోలను అతడు AIతో మార్ఫింగ్ చేసి విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ నిందితుడిని <<18125828>>సస్పెండ్<<>> కాకుండా మొత్తం సర్వీస్ నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై POCSO ACTలోని సెక్షన్ 21 కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని CP తెలిపారు.

Similar News

News October 29, 2025

అధికారులు అప్రమత్తం ఉండాలి: వరంగల్ ఎంపీ

image

మొంథా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజల భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సూచించారు. కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్, రోడ్డు భద్రత తదితర శాఖల అధికారులతో ఎంపీ డాక్టర్ కావ్య టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

News October 29, 2025

హైదరాబాద్‌లో అతిపెద్ద మెక్‌ డొనాల్డ్స్‌ కేంద్రం ప్రారంభం

image

అంతర్జాతీయ ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్‌ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.

News October 29, 2025

వరంగల్: రేపు పాఠశాలలకు సెలవు

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. బుధవారం ఆకస్మికంగా సెలవు ప్రకటించిన విషయం విదితమే. వర్షాలు కొనసాగుతుండడంతో పాటు తుఫాను తెలంగాణ కేంద్రీకృతమే ఉన్న కారణంగా ఈ సెలవును పొడిగిస్తున్నట్లు ఆమె చెప్పారు. పిల్లలెవరూ చేపల వేటకు వెళ్లొదని కోరారు.