News January 6, 2026
KNR: AIFB పార్టీ వైపు ఆశావహుల చూపు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP, BRS పార్టీలలో కాంపిటీషన్ ఉండటంతో ఆశావహులు AIFB పార్టీ టికెట్ పై పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆపార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి AIFBలో సభ్యత్వం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. ఉమ్మడి KNRలో AIFB నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం MLAగా కోరుకంటి చందర్ గెలవగా, గత మున్సిపల్ ఎన్నికల్లో RGMలో 11, KNRలో 3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకుంది.
Similar News
News January 7, 2026
గొర్రెలు, మేకలకు ‘పాక్స్’ టీకాలు: జిల్లా పశువైద్యాధికారి

ఈ నెల 8 నుంచి 22 వరకు నల్లగొండ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు పాక్స్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డా.జి.వి.రమేష్ తెలిపారు. వైరస్ వల్ల సోకే ఈ అంటువ్యాధి నివారణకు 78 బృందాలు గ్రామాల్లో పర్యటించనున్నాయి. జ్వరం, చర్మంపై బొబ్బలు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. పెంపకందారులు మూడు నెలలు పైబడిన మూగజీవాలకు టీకాలు వేయించి, ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.
News January 7, 2026
పెద్దపల్లి: ‘మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం’

న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ ఒక గొప్ప ప్రత్యామ్నాయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలో ‘మధ్యవర్తిత్వం-మిడియేటర్’ అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, ధనం ఆదా అవ్వడమే కాకుండా ఉభయ పక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కారం లభిస్తుందని వివరించారు.
News January 7, 2026
20 మందికి జైలు.. 86 మందికి జరిమానా: KMR ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 106 మందికి కోర్టు శిక్షలు విధించినట్లు జిల్లా SP రాజేశ్ చంద్ర బుధవారం తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు ఒక్కోరికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు చెప్పారు. మరో 86 మందికి మొత్తం రూ.87 వేల జరిమానా విధించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లాలో నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.


