News March 29, 2024
KNR: BJPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.
Similar News
News January 3, 2026
పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

పోస్టల్ డిపార్ట్మెంట్లో అవకతవకలకు పాల్పడిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సత్యంను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పోస్టల్ శాఖ అకౌంట్లో జమ చేయకపోవడంతో వినియోగదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోస్టల్ శాఖ రూ.3.5 లక్షల అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి వెంటనే సస్పెండ్ చేసింది.
News January 2, 2026
శాతవాహన అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా ఎస్ రమాకాంత్

శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగంలో డాక్టర్ ఎస్.రమాకాంత్ పీజీ & ప్రొఫెషనల్ పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నియమకయ్యరు. ఈ మేరకు ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ రిజిస్టర్ ఉత్తర్వులు అందజేశారు. రమాకాంత్ ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు.
News January 2, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారంలో వివిధ సొసైటీల ద్వారా 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.


