News March 29, 2024

KNR: BJPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.

Similar News

News September 7, 2025

కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

image

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.

News September 7, 2025

కరీంనగర్: ఓపెన్ స్కూల్లో చేర్చాలి

image

స్వయం సహాయక సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మెప్మా, డీఆర్‌డీఓ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ వెంటనే ఓపెన్ స్కూల్లో చేర్పించి, విద్యను ప్రోత్సహించాలని సూచించారు.

News September 6, 2025

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తపల్లిలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.