News March 29, 2024
KNR: BJPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.
Similar News
News January 12, 2025
VMWD: ఏ పుణ్యక్షేత్రానికి పోవాలన్న రాజన్నను దర్శించుకోవాల్సిందే!
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి ఒక ఆనవాయితీ ఉంది. ఏ పుణ్యక్షేత్రానికి పోవాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలు ముందుగా రాజన్నను దర్శించుకుంటారు. కోడెను తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, రాజన్నను దర్శించుకోవడం వల్ల తమ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందని భక్తుల నమ్మకం.
News January 12, 2025
కరీంనగర్: సంక్రాంతికి మన జిల్లాలో సకినాలే ఫేమస్
సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ముగ్గులు, పతంగులు. కొన్నిచోట్ల అయితే కోళ్ల పందేలు. కానీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం గుర్తొచ్చేది సకినాలు. అవును.. సకినాలనేవి సంక్రాంతి సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్. ప్రతి ఇంటి పిండి వంటలో ఇవి కచ్చితంగా ఉంటాయి. ఇవి లేకుండా ఓల్డ్ కరీంనగర్ జిల్లాలో పండుగనే జరగదు. మరి ఇంట్లో సకినాలు చేశారో? లేదో కామెంట్ చేయండి.
News January 12, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,25,314 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,16,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,590, అన్నదానం రూ.19,010 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.