News March 4, 2025
KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్ధి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News November 3, 2025
జగిత్యాల: 55 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు..!

జగిత్యాల పట్టణంలోని మల్టీపర్పస్ హయ్యర్ సెకండరీ స్కూల్ ( ప్రస్తుత ఓల్డ్ హై స్కూల్ ) 1969-70 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 55 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరంతా తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా హాయిగా గడిపారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, రాచకొండ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.
News November 3, 2025
మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్కు అప్పగించారు.
News November 3, 2025
హన్వాడ: సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది

యాదవులు జరుపుకునే సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హన్వాడ మండలం కేంద్రంలో సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతులకు నిలయంగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించారు.


