News March 4, 2025
KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్ధి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
Similar News
News March 27, 2025
ఆ సీన్ కోసం 1000 సార్లు చూస్తారు: RC16 నిర్మాత

రామ్ చరణ్ ‘RC16’పై అభిమానుల్లో అంచనాలు పెంచేలా నిర్మాత రవిశంకర్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గ్లింప్స్ చూశానని, ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన ఓ సన్నివేశం కోసమైనా ప్రేక్షకులు 1000 సార్లు చూస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
News March 27, 2025
VKB జిల్లాలో నేటి TOP NEWS..!

❤ VKB:బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బసవరాజ్ పటేల్ ❤VKB: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు:అదనపు కలెక్టర్ ❤రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన తాండూరు ఎమ్మెల్యే ❤మెరుగైన వైద్యం అందించాలి: పరిగి మాజీ ఎమ్మెల్యే ❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ❤పరిగి:శ్రీ సత్య హరిచంద్ర వీధి నాటక ప్రదర్శన ❤మల్లికార్జున్ ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే.
News March 27, 2025
5 వైద్యశాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు

AP: ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 5 ప్రభుత్వ వైద్య శాలలకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరయ్యాయి. వాటిలో రంగరాయ మెడికల్ కాలేజీ, రాయచోటి, చీరాల, పాలకొండ, భీమవరం ఏరియా ఆస్పత్రులున్నాయి. ఒక్కో యూనిట్‌కు రూ.23.75 కోట్ల చొప్పున మొత్తం రూ.118.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ఆస్పత్రుల్లో 50 బెడ్స్‌తో ఐసీయూ విభాగాలు ఏర్పాటవుతాయి.