News February 11, 2025

KNR: MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?

image

✓మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫొటోస్ ఉంటాయి ✓మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చేవారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి ✓ఇతరులకూ మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు వేయవచ్చు✓పోలింగ్ సిబ్బంది ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి ✓పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు మీ ఐడీ ప్రూఫ్ తీసుకువెళ్లాలి✓బూత్ లోపలకు వెళ్లేముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి ✓బూత్ బయట ఓటర్ లిస్ట్‌లో మీ పేరు, క్రమసంఖ్యను చూసుకోండి.

Similar News

News December 5, 2025

బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

image

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్‌ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 5, 2025

‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

image

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.

News December 5, 2025

కడప రిమ్స్ సేవలు నిరాశపరుస్తున్నాయి!

image

కడప రిమ్స్ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?’ అంటూ Way2Newsలో పబ్లిష్ అయిన <<18460527>>వార్తకు<<>> భారీ స్పందన లభించింది. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, రెఫరెన్స్‌తో సేవలు త్వరగా అందుతాయని, కొన్ని సేవలకు లంచం ఇవ్వాలని, కొందరు వైద్యులు, నర్సులు కఠినంగా మాట్లాడతారని కామెంట్ల రూపంలో ఎండగట్టారు. ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులో సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.