News February 27, 2025
KNR: MLC ఓటు ఎలా వేయాలో తెలుసా..?

✓మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు, ఫోటోస్ ఉంటాయి✓మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి ఎదురుగా ఉన్న బాక్సులో 1వ నంబర్ వేయాలి✓ఇతరులకు కూడా మీకు నచ్చిన ప్రాధాన్యత ఓటు కూడా వేయవచ్చు✓పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి✓వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి✓బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి✓బూత్ బయట ఓటర్ లిస్టులో మీ పేరు, క్రమ సంఖ్య చూసుకోండి.
Similar News
News February 27, 2025
తూ.గో: జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

తూర్పుగోదావరి జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో చర్లపల్లి – (07031) కాకినాడ టౌన్‌కు, మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో కాకినాడ టౌన్ – చర్లపల్లి ( 07032) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. జిల్లాలో రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లో ఆగుతాయని అధికారులు వివరించారు.
News February 27, 2025
అనకాపల్లి జిల్లాలో 85 శాతం పోలింగ్: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయం ముగిసే సరికి 85 శాతం పోలింగ్ పూర్తయినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో 357 పురుషుల ఓటర్లలో 273 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 257 మహిళా ఓటర్లలో 202 మంది తమ ఓటు హక్కును ఇప్పటివరకు వినియోగించుకున్నట్లు ఆమె వెల్లడించారు.
News February 27, 2025
మహిళల రక్షణలో సమాజానికీ బాధ్యత ఉంది: జస్టిస్ చంద్రచూడ్

పుణేలోని బస్సులో యువతిపై జరిగిన <<15593054>>అత్యాచారంపై<<>> మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కేవలం చట్టాలతోనే దురాగతాలను నివారించలేమని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించాలని తెలిపారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు.